calender_icon.png 6 November, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ చేతికి గాయం

15-08-2024 12:05:11 AM

జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని, ప్రస్తుతం ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బుధవారం ఉదయం వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీమ్ వెంటనే స్పందించింది. అదంతా అవాస్తవమని ఖండించింది. ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. “రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ జిమ్‌లో కరసత్తులు చేస్తుండగా ఆయన ఎడమ చేతికి స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన మంగళవారం ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొన్నారు.

ప్రస్తుతం కోలుకుంటున్నారు” అని వివరించింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రమే ‘దేవర’. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఎన్టీఆర్ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘దేవర’ పార్ట్ కోసం తన షెడ్యూల్ మంగళవారంతో పూర్తయిందని వెల్లడించారారు. ‘నా చివరి షాట్‌ను పూర్తి చేశాను. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రాజెక్టులో భాగమైనవారు పంచిన ప్రేమను, అద్భుత బృందాన్ని మిస్సవుతున్నా. శివుడు రూపొందించిన దేవర ప్రపంచంలోకి వెళ్లేందుకు ఆసక్తిగా వేచిచూస్తున్నా’ అని రాసుకొచ్చారు ఎన్టీఆర్.