calender_icon.png 18 January, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు..

18-01-2025 01:02:46 PM

మణుగూరు (విజయక్రాంతి): మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోనే పినపాక అరకగూడెం అశ్వాపురం మండలాల్లో టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఉమ్మడి ఏపి సీఎం, తెలుగు ప్రజల అభిమాన హీరో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మణుగూరు టిడిపి కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని చాతిని ప్రపంచ నలుమూలల చాటిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వాసిరెడ్డి చలపతి లోకేష్ బచ్చల భారతి కమరున్నీసా బేగం పోశం అశోక్ తదితరులు పాల్గొన్నారు.