calender_icon.png 19 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు

18-01-2025 09:26:27 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి కార్యక్రమం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు హాజరయారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ... తరాలు గడిచిన తరగని అభిమానాన్ని చూరగొన్న మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు  అని, సినీరంగంతో పాటు రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పించిన గొప్ప నాయకుడని. 

ఒక వ్యక్తి మరణించి 29 సంవత్సరాలు గడుస్తున్న ప్రజలు ఆయన వర్ధంతిని జయంతిని మరువకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే. ఆ మహానుభావుడు తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేయడమేనని. ఆయనను ఆదర్శంగా తీసుకొని సేవా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయమని అన్నారు. ముందుగా గ్రామంలో ఉన్న. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి   నివాళులర్పించారు తదుపరి మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో  ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకుఅన్న వితరణ కార్యక్రమం.  నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్చార్జి ఓరుగంటి ప్రభాకర్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు కనగాల నరసింహారావు  నల్లూరి రవి కిన్నెర వెంకటేష్. అల్లి చిన్నరామయ్య  బారి లక్ష్మయ్య. అల్లి కనకారావు జంగిలి గోపి‌ షేక్ సైదా. రామయ్య గారు చెరువుపల్లి లింగయ్య నాగేశ్వరరావు పుల్లయ్య లక్ష్మయ్య ఆదినారాయణ.  సైదులు వీరస్వామి.  తదితరులు పాల్గొన్నారు.