calender_icon.png 19 April, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ యాక్షన్

10-04-2025 12:00:00 AM

టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ పాన్‌ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీమూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయిక నటిస్తుండగా, మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఏప్రిల్ 22 నుంచి కథానాయకుడు ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించింది. 

ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు పేర్కొంది. ఇందులో భారీస్థాయి యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి డీవోపీగా భువన్‌గౌడ, రవి బస్రూర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.