calender_icon.png 17 November, 2024 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీపీసీ గ్రీన్ లక్ష కోట్ల పెట్టుబడులు

14-11-2024 01:48:45 AM

న్యూఢిల్లీ, నవంబర్ 13: సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2027కల్లా రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి చేస్తుందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వెల్లడించారు. ప్రతిపాదిత పెట్టుబడుల్లో 20 శాతం ఈక్విటీ ద్వారా సమీకరిస్తామని, విస్తరణ ప్రాజెక్టులకు కంపెనీ రూ. 20,000 కోట్ల సొంత నిధుల్ని పెట్టుబడి చేయాల్సి ఉంటుందని ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా సింగ్ బుధవారం మీడియాకు   చెప్పారు.

అందు లో రూ. 10,000 కోట్లను రానున్న పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరిస్తామన్నారు. మిగిలిన పెట్టుబడుల్ని అంతర్గత వనరులతో ఇన్వెస్ట్ చేస్తామన్నారు. రుణ సేకరణ గురించి ప్రస్తావిస్తూ ఎన్టీపీసీ గ్రీన్ మాతృసంస్థ దేశంలో అతిపెద్ద విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీ అయినందున పలు ఏజెన్సీల నుంచి మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్నదని, ఈ కారణంగా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోగలుతామని సింగ్ వివరించారు. 

నవంబర్ 19న ఐపీవో

ప్రస్తుతం ఎన్టీపీసీ గ్రీన్ స్థాపక సామర్థ్యం 3,220 మెగావాట్లు ఉండగా, దీనిని 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చికి 11,000 మెగావా ట్లకు, 2027 మార్చినాటికి 19,000 మెగావాట్లకు విస్తరిస్తామన్నారు. ఇప్పటికే 11,000 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయని తెలిపారు. సోలార్ విద్యుత్ కోసం ఒక్కో మెగావాట్‌కు రూ.5 కోట్ల చొప్పున వ్యయమ వుతుందని,

తమ గ్రీన్ ఎనర్జీలో 90 శాతం సౌర విద్యుత్ యూనిట్లే ఉంటాయని, మిగిలిన విండ్ ఎనర్జీ కోసం ఒక్కో మెగావాట్‌కు రూ. 8 కోట్ల చొప్పున పెట్టుబడులు కావాలన్నారు.ఎన్టీపీసీ గ్రీన్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కో షేరును రూ.102 ప్రైస్‌బ్యాండ్‌తో ఆఫర్ చేస్తారు.