- పెన్ పేపర్ మోడ్‌లోనే పరీక్ష
- దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో నిర్వహణ
న్యూఢిల్లీ, జనవరి 16: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఈసారి ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులోనే పరీక్ష నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. 2019 నుంచి ఎన్టీఏ ఏటా ‘నీట్’ నిర్వహిస్తుండగా, గతేడాది పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో ఈసారి పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. మొన్నటివరకు కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహించాలా? లేదా.. పెన్‌బె మోడ్‌లో నిర్వహించాలా? అనే సందిగ్ధంలో ఎన్టీఏ ఉంది. చివరకు పెన్ పేపర్ మోడ్‌నే ఎంచుకున్నది. అభ్యర్థులు 3:20 గంటల సమయంలో అభ్యర్థులు 200 ప్రశ్నలకు సమాధానం టిక్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.