calender_icon.png 26 November, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిని మార్చాలి

26-11-2024 02:35:36 AM

గాంధీభవన్ ఎదుట వ్యతిరేక వర్గం నిరసన 

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి ): ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ ఆ పార్టీ కి చెందిన మరో వర్గం నాయకులు సోమవారం గాంధీభవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఏపీకి చెందిన వెంకటస్వామని తెలంగాణ ఎన్‌ఎస్ యూఐ అధ్యక్షుడిగా నియమించి..

ఇక్కడి విద్యార్థి నాయకులకు అన్యా యం చేశారని విమర్శించారు. తెలంగాణలోని పదవులు ఇక్కడి వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంకటస్వామి తెలంగాణ వారిని పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ధర్నా చేస్తు న్న వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు.