calender_icon.png 22 April, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం

10-04-2025 02:13:49 AM

జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి 

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డిసిసి కార్యాలయంలో సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు.

ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్ ఎస్ యూ ఐ జిల్లా నాయకుడు బసవేని తేజస్ మరియు ఎన్‌ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు తాళ్ల సుమంత్ ఆధ్వర్యంలో జరిగినవి.ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 1971 లో మాజీ ప్రధాని ఉక్కుమహిళ ఇందిరా గాంధీ విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌యూఐ ని స్థాపించారని యాభై అయిదు సంవత్సరాలుగా విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఒక శక్తిగా ఎన్‌ఎస్యుఐ ఎదిగిందని అన్నారు.

  ఇందిరాచౌక్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి  నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీతో డిసిసి ఆఫీస్ కు చేరుకుని జండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండితాజ్, అక్బర్ అలీ ఎన్‌ఎస్యుఐ నాయకులు సాయి,కోరేపు వెంకటేష్, అజయ్, విక్రమ్ గౌడ్  పాల్గొన్నారు.