10-04-2025 02:29:50 AM
జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 9 ( విజయ క్రాంతి): ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం నాడు ప్రిన్స్ చౌరస్తాలో జిల్లా ప్రధాన కార్యదర్శి సురపంగ చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఎన్ ఎస్ యు ఐ జెండాను ఆవిష్కరించి దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ నిరంతరం విద్యార్థుల సమస్యల పట్ల పనిచేస్తూ వారికి అండగా నిలబడుతూ దేశంలో అత్యంత బలమైన విద్యార్థి సంఘంగా అవతరించిందని అన్నారు. విద్యార్థుల సమస్యలపై పనిచేస్తూ ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం దిశగా పనిచేయాలని విద్యార్థి సంఘ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ సంఘ నాయకులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి ఆఫీస్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావు, పిసిసి ప్రధాన కార్యదర్శి పి ప్రమోద్ కుమార్ కుమార్, పిసిసి డెలిగేట్ తంగేళ్లపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జాంగిర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, మాజీ అధ్యక్షులు గీసుకుంట్ల సత్యనారాయణ, సేవాదళ్ జిల్లా నాయకులు పిట్టల బాలరాజు, తాడూరి నరసింహ ఎండి సల్లావుద్దీన్ గుర్రాల శ్రీనివాస్ పోకల యాదగిరి బర్రె నరేష్ కొల్లూరి రాజు విట్టల్ వెంకటేష్ కొండమడుగు అశోక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.