calender_icon.png 26 December, 2024 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేక్ ప్రొటెక్షన్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌సీ భాగస్వ్యామం

25-12-2024 12:46:51 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): చెరువుల పరిరక్షణలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంట(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) కూడా ఇక నుంచి భాగస్వామ్యం కానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈమేరకు మంగళవారం బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) కార్యాలయాన్ని ఆయన సంద ర్శించారు.

చెరువుల పరిరక్షణ కమిటీలో భాగస్వామ్యం కావాలని ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌ను కోరగా అందుకు వారు అంగీకరించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీల ద్వారా చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాల ఆక్రమణలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరిం చేందుకు హైడ్రా చర్యలు చేపడుతుందన్నారు.

ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్‌ల నుంచి సమాచారాన్ని హైడ్రా సేకరించిందని అన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ వద్దనున్న హైరెజల్యూషన్ శాటిలైట్ ఇమేజీల ద్వారా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. 

సమన్వయంతో పనిచేయాలి..

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణలో ఇతరులెవరూ ప్రశ్నించడానికి ఆస్కా రం లేకుండా నిర్ధిష్టమైన విధానాలు అవలభించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు.

ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువుల పరిరక్షణపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మెదక్ జిల్లాలకు చెందిన హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులతో ట్యాంక్‌బండ్ బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన లేక్ ప్రొటెక్షన్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  చెరువుల పరిరక్షణలో ముడిపడి ఉన్న వివిధ విభాగాలు, అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు.