calender_icon.png 16 October, 2024 | 2:15 PM

పేదింటి విద్యార్థిని చదువుకు ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ సాయం

16-10-2024 02:38:56 AM

  1. భర్తను కోల్పోయిన మరో మహిళకు సైతం 
  2. కేటీఆర్ చేతుల మీదుగా రూ.50 వేల చొప్పున అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పేదింటి విద్యార్థిని చదు వుకు ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ పొట్టి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. షాద్‌నగర్‌కు చెందిన భైరమోని మేఘ న మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఫీజును చెల్లించారు. సంబంధిత చెక్కును మంగళవారం నందినగర్‌లో కేటీఆర్ చేతుల మీదుగా అందించారు. రమేశ్, మంజులకు మేఘన సహా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

చిన్న టిఫిన్ సెం టరే వీరికి ఆధారం. ఐతే చదువులో టాపర్ అయిన మేఘన ఇటీవల మె డిసిన్ సీటు  సాధించింది. ఫీజు చెల్లిం చే స్థోమత లేకపోవడంతో విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేఘన చదువుకు సాయమందిస్తానని మాటిచ్చారు. కేటీఆర్ చేస్తున్న సాయంలో తానూ భాగం అవుతానంటూ ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ ముందుకొచ్చారు.

అలాగే స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన ప్రశాంత్ అనే యువకుడు చిన్న వయసులోనే మృతిచెందగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ రూ.50 వేలు ఆర్థిక సాయం చే శారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మె ల్యే రాజయ్య ఆధ్వర్యంలో ప్రశాంత్ భార్యకు కేటీఆర్ రూ.50 వేల చెక్కు అందించారు.