మనిషి కణాల సాయంతో లొకేషన్ నిర్ధారణ
కొత్త టూల్ డెవలప్ చేస్తున్న సైంటిస్టులు
న్యూఢిల్లీ, నవంబర్ ౧౫: అన్నిరంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఏఐ సాంకేతికతో వినూత్న ఆవిష్కరణను శాస్త్రవే త్తలు అభివృద్ధి చేస్తున్నారు. మానవుల కణా ల సాయంతో ఏఐని ఉపయోగించి లొకేషన్‌ను గుర్తించే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సంప్రదాయబద్ద జీపీఎస్ సహాయంతో కాకుండా ఏఐ టూల్ ద్వారా శరీరంలోని మైక్రోఆర్గానిజమ్స్ సాయంతో మనిషి లొకేషన్ ఎక్కడ ఉన్నది.. ఎక్కడెక్కడ ప్రయాణించి ంది ఇట్టే తెలుసుకునేందుకు స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మైక్రోబయోమ్ జియోగ్రాఫిక్ పాపులే షన్ స్ట్రక్చర్ (ఎంజీపీఎస్) ద్వారా లొకేషన్‌ను కనుక్కోనున్నారు.
మన శరీరంలోని మైక్రోఆర్గానిజమ్స్ ద్వారా ఏఏ ప్రదే శానికి పోయింది ఇట్టే తెలియనుందట. ఇందుకోసం మైక్రోబయోమ్‌లు ఉపయోగపడ నున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘మనిషి డీఎన్‌ఏతో పోల్చి చూసినపుడు మైక్రోబ యోమ్ అనేది వాతావరణాన్ని బట్టి మారు తూ ఉంటుంది’ అని లుండ్ యూనివర్సిటీ రీసెర్చర్ ఒకరు తెలిపారు. ఇప్పటికే జీపీఎస్ వల్ల ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ సాంకేతికత కనుక అందుబాటులోకి వస్తే మరింత నిర్ధిష్టంగా లొకేషన్‌ను కనుక్కోవడం కానుంది.