calender_icon.png 13 December, 2024 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా!

13-12-2024 12:01:22 AM

న్యూఢిల్లీ:  ఉద్యోగ భవిష్య నిధికి (ఈపీఎఫ్) సంబంధించి వచ్చే ఏడాదిలో కీల క మార్పు రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణ ఇకపై సులభతరం కానుం ది. ఏటీఎంల  ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుం ది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఐటీ సిస్టమ్స్ అప్‌‌‌రరగేడింగ్ ప్రక్రియ మొదలైందని, వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి రానుందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తాజాగా పేర్కొన్నారు. 

ఇది ఎంత వరకు ప్రయోజనం?

తమ పీఎఫ్ నిధుల ఉపసంహరణకు ఆన్‌లైైన్, ఆఫ్‌లైైన్ పద్ధతుల్లో చందాదారులకు ఈపీఎఫ్‌ఓ వీలు కల్పిస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో గరిష్ఠంగా 90 శాతం వరకు నిధులను తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వివా హం వంటి సందర్భాల్లో ఈ నిధులు విత్‌డ్రాచేసుకోవచ్చు. సంబంధిత కారణాన్ని చూపుతూ క్లెయిమ్ రిక్వెస్ట్ పెడితే కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి.

గతంతో పోలిస్తే క్లెయి మ్ సెటిల్మెంట్‌లో జాప్యం తగ్గినప్పటికీ.. సత్వర ఉపసంహరణకు మాత్రం వీలు కావడం లేదు. ఏటీఎం విత్డ్రా సదుపా యం ఈ సమస్యకు పరిష్కారం చూపనుంది. ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా కోసం ప్రత్యేకంగా డెబిట్ కార్డుల తరహా లో పీఎఫ్ కార్డులు తీసుకొస్తారని తెలుస్తోంది.

లేదంటే ఈపీఎఫ్ ఖాతాకు తమ బ్యాంక్ అకౌంట్స్‌ను అనుసంధానం చేసి ఇది వరకే ఉన్న డెబిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని సమాచారం. ప్రస్తు తానికి దీనిపై స్పష్టత లేదు. అది కూడా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తారని సమాచారం.