09-04-2025 12:00:00 AM
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో పనిచేశారు. అశోక్‌తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై డీ మధు నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహ, హెబ్బా పటేల్, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్‌రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏప్రిల్ 17న థియేటర్లలోకి రానుందీ సిని మా. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేక ర్స్ మంగళవారం ముంబయిలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ తమ న్నా మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలు నటీనటులకు అరుదుగా వస్తుంటాయి. ఇందులో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ సిని మా కోసం ప్రకృతి కూడా మాకు సపోర్ట్ చేసిందని నమ్ముతున్నాం’ అన్నారు.
సంపత్ నంది మాట్లాడుతూ.. “ఇలాంటి కథ రాయడానికి మా నానమ్మ, భార్యే నాకు స్ఫూర్తినిచ్చారు. వాళ్లే నాకు స్ఫూర్తి. తమన్నా ఈ సినిమాలోని శివశక్తి పాత్రను మరో స్థాయికి చేర్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. మండుటెండలో చెప్పు లు లేకుండా నడిచారు. ఈ సినిమా తర్వాత తమన్నాకు విభిన్నమైన రోల్స్ వస్తాయి. ఆమె కోసం పాత్రలు సృష్టించబడతాయి” అని చెప్పారు.
‘తమన్నా ఈ సినిమాతో ప్రేక్షకులకు వండర్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరి యన్స్ ఇవ్వబోతున్నారు’ అని నిర్మాత మధు తెలిపారు. నటుడు వశిష్ఠ సింహ మాట్లాడుతూ.. ‘నేను తమన్నాకు అభిమానిని. ఆమెతో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ అని చెప్పారు. ఆదిత్య భాటియా మాట్లాడుతూ.. ‘నాకు కమర్షియల్ సినిమాల మీద చాలా నమ్మకం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ చూడగానే పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్’ అన్నారు.