నల్లగొండ, జనవరి 16 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగకు పట్నం నుంచి పల్లెలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమ దీంతో జాతీయ రహదారి 65 హైదారాబాద్ వైపు గురువారం వాహనాల రద్దీ పెరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మొత్తం 16 టోల్ బూతుల్లో 12 హైదరాబాద్ వైపు తెరిచారు. చౌటుప్పల్‌లో వాహనాలు భారీగా బారులుదీరాయి. కేతేపల్లి టోల్‌ప్లాజా, నార్కెట్‌ప ల్లి రహదారిపై మాడుగులపల్లి సమీపంలోని టోల్‌ప్లాజాల్లో అదనపు టోల్‌బూత్‌లు కేటాయించారు.