దర్శకుడు వేణు యెల్దండి కొద్దిరోజుల క్రితం ‘ఎల్లమ్మ’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ గ్రామీణంలో బాగా పాపులర్ అయిన పేరును తన సినిమా టైటిల్ ఎంచుకోవటంతోనే వేణు సినీప్రియులను దృష్టిని ఆకర్షించారు. ఎల్లమ్మ గ్రామ దేవత కావటం.. ఇక్కడి మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉండటంతో ప్రజల్లోకి ఈ టైటిల్ తొంద రగా వెళ్లే అవకాశం ఏర్పడింది.
ఇందులో నితిన్ హీరోగా ఫైనల్ కా గా, ఆయనకు జోడీగా సాయిపల్లవి కనిపించనుందనే టాక్ వినవస్తోంది. తాజాగా వేణు ఓ అప్‌డేట్ ఇచ్చారు. జిమ్‌లో తాను వర్క్ అవుట్స్ చేస్తున్న ఫొటోల ను వేణు పంచుకున్నారు.
‘సిద్ధమవుతున్నా.. త్వరలోనే అప్‌డేట్ ఇస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో వేణు కండలు దిరిగిన దేహంతో కనిపిస్తున్నారు. అంటే ఈ సినిమాలో వేణు ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో అని చెప్తున్నాడు కాబట్టి.. ఈ ప్రాజెక్టు ఈ ఫిబ్రవరి నెలలోనే పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.