calender_icon.png 22 October, 2024 | 4:59 AM

ఇక బుజ్జమ్మ అని పిలుస్తారు

22-10-2024 12:00:00 AM

యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘పొట్టేల్’. దర్శకుడు సాహిత్ మోత్కూరి తెరకెక్కిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ఇది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ పతాకాలపై నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా అనన్య నాగళ్ల సోమవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించింది.   

మీకు వస్తున్న క్యారెక్టర్ల పట్ల హ్యాపీగా ఉన్నారా?

-ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొన్ని లవ్ స్టోరీస్, క్యూట్ క్యారెక్టర్స్ చేద్దామనుకున్నా. అయితే అప్పుడు నాకు అంత అవగాహన లేదు. ‘మల్లేశం’ తర్వాత ప్రేక్షకులు ఒక డిఫరెంట్ లుక్‌లో చూశారు. ఈ విషయంలో హ్యాపీగానే ఉంది. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రూల్స్ కావాలంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న ఇద్దరు ముగ్గురిలో నా పేరూ వినిపిస్తుంది. 

యువతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

-యువ, నేను ఇన్ఫోసిస్‌లో వర్క్ చేశాం. అప్పుడు ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదు కానీ ఆయన చేసిన షార్ట్ ఫిలిమ్స్‌తో ఇన్‌స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చా.   

మీరు కొత్తగా చేస్తున్న సినిమాల గురించి?

‘శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్’ రిలీజ్‌కు ఉంది. ‘కథాకళి’, ‘లేచింది మహిళా లోకం’అనే మరో రెండు సినిమాల్లోనూ చేస్తున్నా. 

‘పొట్టేల్’లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి?

ఇంతకుముందు మదర్‌గా ఒక వెబ్ సిరీస్ చేశా. మళ్లీ మదర్ అంటే సిమిలర్ అవుతుందేమో అనుకున్నా. అయితే ‘పొట్టేల్’లో చదువు అనే పాయింట్ చాలా నచ్చింది. నా పాత్ర షూట్ చేసిన తర్వాత తెలిసింది, ఆ సిరిస్‌లో చేసిన రోల్‌కి ఇందులో రోల్‌కి ఎక్కడా పోలిక లేదు.

ఇందులో నా క్యారెక్టర్ పేరు బుజ్జమ్మ. ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. -ఇందులో నాది చాలా స్ట్రాంగ్ రోల్. ఇందులో పొట్టలో తన్నే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ ఎలా వస్తుందో అని మొదట కాస్త కంగారు పడ్డా. అజయ్ గారి లాంటి సీనియర్ యాక్టర్ ఉండటం వల్ల ఈ ఆ సీన్ అంతా కంఫర్టబుల్‌గా వచ్చింది.

టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?

పొట్టేల్ లేకపోతే ఈ కథ లేదు. పొట్టేల్ పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకొడుతుంది కానీ ఆగదు. అది పొట్టేల్ నేచర్. ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ముందుకెళ్లడమే కానీ వెనక్కి వచ్చే సమస్య లేదు. అలా రెండు విధాలుగా ఈ సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్ వచ్చింది.