calender_icon.png 5 February, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పుడు మన వంతు.. 205 మంది వెనక్కి

05-02-2025 01:53:33 AM

అమెరికాలో అక్రమ వలసలపై వేటు

టెక్సాస్ నుంచి అమృత్‌సర్ బయల్దేరిన మిలటరీ విమానం

18వేల మంది భారతీయుల బహిష్కరణ!

  1. అగ్రరాజ్యంలో 11 మిలియన్ల మంది అక్రమవలసదారులు
  2. ఇందులో భారతీయల సంఖ్య 7.25లక్షలు 
  3. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత స్థానం భారత్‌దే..

వాషింగ్టన్, ఫిబ్రవరి 4: అక్రమవలసదారులపై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని ప్రత్యేక విమానాల్లో తిరిగి తమ స్వదేశాలకు సాగనంపే ప్రక్రియను ప్రారంభిం చింది.

ఈ నేపథ్యంలోనే 205 మంది భారతీయలతో కూడిన సీ-17 అనే యూఎస్ మిలిటరీ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు టెక్సాస్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు బయల్దేరింది. ఈ విమానం బుధ వారం తెల్లవారుజామున అమృత్‌సర్‌కు చేరుకునే అవకాశం ఉంది. ట్రంప్ మొదటి నుంచీ అక్రమవలసలను వ్యతిరేకిస్తున్నారు.

ఎన్నికల ర్యాలీల్లో కూడా ఈ సమస్యనే ఆయన ప్రధానంగా ప్రస్తావించడంతోపాటు.. అమెరికాలో అక్ర మం గా నివాసం ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. తన ఎన్నికల హామీని అమలు పరుస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ప్రారంభమైంది. 

11 మిలియన్ల మంది..

వివిధ దేశాలకు చెందిన దాదాపు 11 మిలియన్ల మంది అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివాసం ఉంటున్నట్టు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో మెక్సికోకు చెందిన వాళ్లే అత్యధికంగా ఉండగా ఆ తర్వాత స్థానంలో ఎల్ సాల్వడార్ దేశస్థులు ఉన్నారు. ఈ జాబితాలో భా రత్ మూడోస్థానంలో ఉంది. ప్యూ రీసెర్చ్ సె ంటర్ నివేదిక ప్రకారం అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా ని వాసం ఉంటున్నారు. 18వేల మందిని  త రలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. 

బహిష్కరణపై భారత్ ఏమంటుందంటే..

సరైన ధ్రువపత్రాలు లేకుండా విదేశాల్లో నివాసం ఉంటున్న భారతీయులను చట్టబద్ధంగా వెనక్కి తీసుకురావడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర ప్రభు త్వం గతంలోనే స్పష్టం చేసింది. ‘మా దేశ పౌరులెవరైనా అక్రమంగా వలస వెళ్లినట్టు గుర్తిస్తే వారిని న్యాయబద్ధంగా తిరిగి భారత్‌కు తీసుకురావడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. కాగా ఏ దేశమైనా అక్రమవలసదారుల బహిష్కరణను వ్యతిరేకిస్తే సదరు దేశానికి సంబంధించిన దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలు పెంచేస్తుంది. 

లక్షల డాలర్ల ఖర్చు

అక్రమవలసదారులను తరలించేందుకు అమెరికా ప్రభుత్వం లక్షల డాలర్లను ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. బహిష్కరణ ఆపరేషన్ కోసం రక్షణ శాఖకు చెందిన సీ-17, సీ-130ఈ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అమెరికా ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఇందులో సీ-17 విమాన నిర్వహణకు గంటకు 21వేల డాలర్లు, సీ-130ఈ  ఎయిర్‌క్రాఫ్ట్‌కు 68వేల నుంచి 71వేల డాలర్లు ఖర్చవుతుందట.

అక్ర మంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపేందుకు అమెరికా ౫ లక్షల డాలర్లను ఖ ర్చు చేస్తోంది. గ్వాటెమాలాకు పంపేందుకు ఓక్కో వ్యక్తికి 4675 డాలర్లు ఖర్చయినట్టు లెక్కలు చెబుతున్నాయి. సాధారణ టికెట్‌తో పోల్చితే ఈ ఖర్చు ఐదు రెట్లు ఎక్కువట.