calender_icon.png 11 January, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోట్రెడామ్ చర్చి పునఃప్రారంభం

08-12-2024 12:40:12 AM

* హాజరైన ట్రంప్, ప్రిన్స్ విలియం

పారిస్, డిసెంబర్7: మంటల్లో చిక్కి కాలిపోయిన 860 సంవత్సరాల చరిత్ర గల గోతిక్ కేథడ్రల్ నోట్రేడామ్ చర్చిని అయిదేళ్ల తరువాత శనివారం సాయంత్రం పునః ప్రారంభించారు. ఈ చర్చి పునరుద్ధరణను ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఈ వేడుకకు అమెరికా నూతన అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలి యం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీతో పాటు దాదాపు 50 దేశాల అధినేతలు, రాయల్, సెలబ్రిటీలు, క్రైస్తవ మతాధికారులు అతిథులుగా హాజరయ్యారు.  దాదా పు 700 మిలియన్ల యూరోలు వెచ్చించి నోట్రేడామ్ చర్చిని పునర్నిర్మించారు.

2019, ఏప్రిల్ 15న ప్రమాదవశాత్తు  మంటలు అంటుకుని చరిత్రాత్మక కేథడ్రల్ పైకప్పు, శిఖరం ధ్వంసమైంది. ప్రమాదం జరుగక ముందు పారిస్‌లో అత్యధిక మంది సందర్శించే స్మారక కట్టడాలలో ఈ చర్చి ఒకటిగా ఉండేది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రసంగం తరువాత సాయంత్రం 7 గంటలకు నోట్రెడామ్‌ను ప్రారంభించారు.  పునరుద్ధరణ తరువాత ఆదివార ఉదయం 10,30 గంటలకు మొదటి ప్రార్థన జరుగనుంది. పునరుద్ధరించబడిన తరువాత తెల్లరాయి. బంగారు అలంకరణతో చర్చి వెలిగిపోతోంది.