సమస్యలను పరిష్కరించాలి
సీఐటీయూ నాయకులు
మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా ఆఫీసులలో పని చేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) శ్రీరాంపూర్ బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు గుండ్ల బాలాజీ, అంబాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ ఇచ్చి నెలలు కావస్తున్న పరీక్ష తేదీ చెప్పకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారన్నారు. వెంటనే పరీక్ష నిర్వహించే తేదీని ప్రకటించి పరీక్షలు నిర్వహించి సిబ్బంది కొరతను తగ్గించాలని కోరారు.
ప్రతి సెక్షన్లో కొత్త కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేసి సీఎంపీఎఫ్ చిట్టీలను సకాలంలో అందించాలన్నారు. కార్యాలయాల నిర్వహణ నిమిత్తం ఉన్న డెలిగేషన్ పవర్ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్రాంచి ట్రెజరరీ కస్తూరి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శులు ఎం శ్రీదర్, శైల శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, శ్రీపతి బానేష్, కేసి పెద్ది శ్రీనివాస్, మిడివెల్లి శ్రీనివాస్, పెరుక సదానందం, తోడె సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.