calender_icon.png 7 February, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజూరు లేని పోస్టులకు నోటిఫికేషన్?

07-02-2025 02:08:57 AM

* నిరుద్యోగులను మోసం చేసిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పోస్టులు మంజూరుకాకున్నా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి ఉద్యోగ ప్రకటన చేయడం గమనా  గురువారం విజయక్రాంతిలో ‘కలెక్టర్ గారు.. ఉద్యోగాలేమాయే’ శీర్షికన కథనం ప్ర  కావడంతో వాస్తవం వెలుగు చూగత ఏడాది జూన్ 16న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 155 ఔట్‌సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.

అయితే అసలు ఆ పోస్టులు మంజూరు కాలేదని, అయినా అప్పటి కలెక్టర్ ప్రియాంక అల ఆదేశాల మే  అప్పటి ఎంప్లాయీమెంట్ అధికారి విజేత నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో జి  23 మండలాల నుంచి 5200 మం  నిరుద్యోగులు వారం రోజుల పాటు కలెక్టరేట్ చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.

ఆరు నెలల నుంచి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. తీరా ఆ పోస్టులు మంజూరు కాలేదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఈ పాపం ఎవరిది, ఎవరిపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఎంప్లాయిమెంట్ అధఙకారి, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు కలిసి నిరుద్యోగ యువత  జీవితాలతో చెలగాటం ఆడారని మండి పడుతున్నారు.

ఈ విషయంమై జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి కే శ్రీరామ్‌ను వివరణ కోరగా.. మెడికల్ కాలేజీ పోస్టులు మంజూరు కాలేదన్నారు. అప్పటి కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశాల మేరకు నోటీఫీకేషన్ జారీ చేశారన్నారు. మంజూరు కాని పోస్టులకు నోటిఫికేషన్ ఎలా జారీ చేశారని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు.