20 నుంచి కళాశాలల ప్రతిపాదనలు స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల పాటు బ్లాక్ పీరియడ్‌కు సంబంధిం చి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీతోపాటు వృత్తివి ద్యా కోర్సులకు సంబంధించిన ఫీజు ల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రక్రియను చేపట్టింది. ఇం దుకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో గత విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఆ దాయ వ్యయాల ఆధారంగా వచ్చే మూడేళ్ల వరకు ఫీజులను నిర్ణయించనున్నారు. యాజమాన్యాలు కో ర్సుల వారీగా తమ ఆదాయ వ్య యాల వివరాలు, ఫీజుల ప్రతిపాదనలను ఈనెల 20 నుంచి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. కాలేజీలకు సంబంధించి ఆడిట్ రిపోర్టు హార్డ్ కాపీలను అక్టోబర్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలని సూచించింది. ఒకవేళ పూర్తి వివరాలను సబ్మిట్ చేయకుం టే ఫీజు ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులు పెరగే చాన్స్ ఉంది.