calender_icon.png 28 October, 2024 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత, జౌళి శాఖలో 30 పోస్టులకు నోటిఫికేషన్

16-07-2024 01:02:16 AM

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): చేనేత, జౌళి శాఖలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (సీడీఈ), టెక్స్‌టైల్ డిజైనర్లు కలిపి మొత్తం 30పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 8 పోస్టులు సీడీఈలు కాగా.. 22ఖాళీలు టెక్స్‌టైల్ డిజైనర్లు.. అని చేనేత,జౌళి శాఖ కమిషనర్ శైల జ రామయ్యర్ పేర్కొన్నారు. ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టుల కాలపరిమితి 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్లో వెల్లడించారు. అయితే మొద టి ఏడాది పనితీరును బట్టి.. తర్వాత రెండేళ్ల ఒప్పందం ఉంటుందని నోటిఫికేషన్‌లో చెప్పారు. 

సీడీఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఐఐటీహెచ్ నుంచి చేనేత టెక్నాల జీలో డిప్ల్లమా కలిగి ఉండాలని అలాగే చేనేత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని సూచించారు. టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎన్‌ఐఫ్‌టీ/ఎన్‌ఐడీ లేదా ఏదైనా పేరున్న సంస్థలో డిజైనర్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు హ్యాండ్లూమ్‌లో టెక్స్‌టైల్ డిజైనర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. నెల కు రూ.24వేల వేతనం చెల్లిస్తామన్నారు. దరఖాస్తులను ఆగస్టు 5వ తేదీలోపు హైదరాబాద్ చేనేత, జౌళి శాఖ కార్యాలయం, మూడో అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి, హైదరాబాద్  500001కు పంపాలని కమిషనర్ చెప్పారు.