calender_icon.png 24 January, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీలో నాలుగు కోర్సులకు నోటిఫికేషన్

24-01-2025 01:36:47 AM

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో నాలుగు స్వల్పకాలిక కోర్సులకు నోటిఫికేషన్‌ను జారీచేశారు. 6 నెలల ఎండోస్కోపి టెక్నీషియన్ కోర్సును ఏఐజీ ఆసుపత్రి, 4 నెలల ఎక్విప్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ కోర్సును బీఎఫ్ ఎస్‌ఐ కన్సార్టియం అందిస్తున్నట్టు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సప్లు చైన్ ఎసెన్షియల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం రెండున్నర నెలల కోర్సును ఓ9 సొల్యూషన్, రెండున్నర నెలల మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్ కోర్సును కిమ్స్ ఆసుపత్రి అందించనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇతర వివరాల ను సరిచూసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియ ను ఈ నెల 30లోగా పూర్తి చేసి, ఫిబ్రవరి మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నట్టు తెలిపారు.