ఈ ఏడాది అందుబాటులోకి 28 కొత్త కాలేజీలు
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేట్ పారా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు గురువారం నోటిఫికే షన్ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ లోపల పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు కాపీలను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలని పేర్కొన్నారు.
జిల్లాల వారీగా నవంబర్ 11వ తేదీ లోపల కౌన్సెలింగ్ పూర్తి చేసి, అదే నెల 20వ తేదీ లోపు ల సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని తెలిపారు. నవంబర్ 25 నుంచి క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నా రు. పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సీట్ల కేటాయింపులో బైపీసీ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
అందుబాటులోకి కొత్త కాలేజీలు
రాష్ర్టంలో 40 ప్రభుత్వ,206 ప్రైవే ట్ పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 28 కాలేజీలు ఈ ఏడాదే నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కాలేజీలో రెండు కోర్సులను ప్రారంభించారు. ప్రతి కోర్సుకు 30 సీ ట్లు కేటాయించారు. దీంతో మొత్తంగా 28 కాలేజీల్లో కలిపి 1,680 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చా యి. వీటితో కలిపి ప్రభుత్వ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 3,122కు పెరిగింది.