calender_icon.png 24 February, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికీపీడియాకు నోటీసులు

19-02-2025 10:54:58 PM

శంభాజీ చరిత్రపై తప్పుడు సమాచారం..

ముంబై: మరాఠా యోధుడు చత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వికీపీడియాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వికీపీడియాలో శంభాజీ చరిత్రను వక్రీకరించారంటూ కొందరు మేధావులు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఫడ్నవీస్ వికీపీడియాను కలిసి సదరు సమాచారాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు.

చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని.. వాస్తవాలను మార్చడం లేదా తప్పుడు కథనాలు ప్రచురించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. సీఎం ఆదేశాలతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు వికీపీడియాకు బుధవారం నోటీసులు జారీ చేశారు. వెంటనే శంభాజీ చరిత్రకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని తొలగించాలని లేదంటే లీగల్‌గా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు.