calender_icon.png 24 October, 2024 | 10:04 PM

రెండేసి పింఛన్లు పొందుతున్న వారికి నోటీసులు

15-07-2024 12:32:23 AM

నోటీసులు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం

జహీరాబాద్, జూలై 14: రిటైర్డ్ ఉద్యోగు లు, వారి మరణానంతరం కుటుంబ సభ్యు లకు వచ్చే పెన్షన్‌తో పాటు ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారికి అధికారులు రెం డ్రోజుల కిందట నోటీసులు జారీ చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఇలా డబు ల్ పెన్షన్లు పొందుతున్న 35 మందిని అధి కారులు గుర్తించారు. వీరు కొన్నేళ్లుగా రెండే సి పింఛన్లు పొందుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పెన్షన్  పొందుతున్న వా రు ఆసరా పింఛన్లు తీసుకోవడానికి వీలు లేదు.

జహీరాబాద్ నియోజకవర్గంలో రెండే సి పెన్షన్లు పొందిన వారి నుంచి రూ.18 లక్షలు రికవరీ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, ఆదివారం నిర్వ హించిన గూగుల్ మీట్‌లో రెండేసి పింఛన్లు పొందుతున్న వారి నుంచి డబ్బుల రికవరీ కోసం నోటీసులు జారీ చేయవద్దని, ఒకవేళ చేసినా వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్, మండల అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్య లు తీసుకోవద్దని ఆదేశించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.