15-11-2024 12:20:41 AM
ముంబై, నవంబర్ ౧౪:: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి మహారాష్ట్ర పోలీసులు నోటీసులు అందించారు. ప్ర చారాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని అలాగే రెచ్చ గొట్టే పదాలను ప్రసంగాలను ఉపయోగించవద్దని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే తన ప్రసంగం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భాన్ని మాత్రం నోటీసుల్లో పేర్కొనలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం నుంచి పోటీ చేస్తోన్న సోలాపూర్ అభ్యర్థి తరఫున ఓవైసీ ప్రచారం చేస్తుండగా అధికారులు నోటీసులు ఇచ్చారు.