నిర్మల్, నవంబర్ 23 (విజయక్రాంతి): కేజీబీవీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంట గదులు శుభ్రంగా ఉంచుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం మామాడ మండలంలోని న్యూ స్వాంగ్వీ గ్రామంలో ఉన్న కస్తూ ర్భా గాంధీ పాఠశాలను తనిఖీ చేశా రు.
పాఠశాలలో కనీస వసతులు లేవని విదా ్యర్థులు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక అధికారితోపాటు ఎంపీడీవోకు కలెక్టర్ షోకాజు నోటీసులు జారీ చేశారు. అనంతరం నాయుడివాడలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఈ వో రామారావు, జిల్లా అధికారులు సలోమి కరుణ, జ్యోతి ఉన్నారు.