11-02-2025 01:31:50 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి గృహ ప్రవేశానికి ఉద్యోగులు, సిబ్బంది అంతా కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిన ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందే 14 మందికి ఒక రోజు వేతనంలో కోత విధించారు. బాల రక్షా భవన్ సిబ్బంది కూడా కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లినట్టు కలెక్టర్‌కు తెలియడంతో మరో 17 మంది సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు సమాచారం. వారికి నోటీసులు జారీ చేయనునట్టు తెలుస్తున్నది.