calender_icon.png 27 December, 2024 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎంసీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు

26-12-2024 02:43:20 AM

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ప్రిన్సిపాల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎంబీబీఎస్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ అలీఖాన్ ర్యాగింగ్ చేయడమే కారణమంటూ కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ, జనవరిలో జరిగే పీజీ పరీక్షలకు అనుమతించాలని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకుమార్‌రెడ్డికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అలీఖాన్ ప్రిన్సిపాల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 20 ఫిబ్రవరి 2023 నుంచి అక్టోబరు వరకు హాజరు వివరాలను రికార్డుల్లో చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయడంలేద న్నారు. వాదనల అనంతరం ప్రిన్సిపాల్‌కు హైకోర్టు నోటీసు లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 27కు వాయిదా వేసింది.