హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లి మం డలం పీర్జాదిగూడ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణా ల్లో 80 ఇండ్లకు తహసీల్దార్ హసీనా శనివా రం నోటీసులు జారీ చేశారు. 40 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు ప్రస్తుతం 30 ఎకరాలకు కుంచించుకుపోయిందని, చెరువుకు సంబంధించి సుమారు 10 ఎకరాల వరకు పూర్తిగా ఆక్రమణలకు గురైందని కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవె న్యూ అధికారులు చెరువు ఆక్రమణలో ఉన్న ఇండ్లకు నోటీసులు జారీ చేసినట్టు తహసీల్దార్ తెలిపారు. చాలా ఏండ్లుగా నివాసం ఉంటున్న తమకు తాజాగా నోటీసులు ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ నోటీసులు జారీ అయిన ప్రజలను కలిసి విషయంపై ఆరా తీశారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈటల భరోస ఇచ్చారు.