calender_icon.png 15 November, 2024 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురికి నోటీసులు?

13-11-2024 02:06:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన  ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం బీఆర్‌ఎస్ నేత చిరుమర్తి లింగ య్యకు నోటీసులు జారీ చేసిన సిట్.. తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేసినట్లు తెలు స్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో లభించిన క్లూస్ ఆధారంగా వీరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

కాగా ఈ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన వారని తెలుస్తోంది. కాగా నోటీసులు అందుకున్నదెవరు? విచారణకు ఎప్పు డు హాజరవుతారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌బీఐ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు  ఉండటంతో విచారణకు రప్పించేందుకు ఇక్కడి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.