- ఎక్‌మామిడి ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్మాణాలు
- సమాధానం ఇచ్చేందుకు మూడురోజుల గడువు
వికారాబాద్, నవంబర్ 24 (విజయక్రాం తి): గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదుతో సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్‌మా మిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ెే345లో అలీ తండ్రి దివంగత మహమ్మద్ బాషా పేరు మీద ఒక ఎకరం ఫామ్‌హౌస్ ఉంది.
ఈ ఫామ్‌హౌస్‌లో గతంలోనే కొన్ని కట్టడాలు జరిగాయి. ఇటీవల కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు గ్రామ పంచాయ తీ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి శోభ రాణి ఈనెల 5న మొదటి నోటీసు జారీచేశారు.
ఆ నోటీసుకు అలీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం తో 22న మరో నోటీ సును ఫామ్‌హౌస్ సిబ్బందికి అందించారు. రెండో నోటీసు అందిన మూడు రోజుల్లో .. అనుమతులు, వాటికి సంబంధించిన పత్రాలను పంచాయతీలో ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే అనుమతిలేని కట్టడాలను కూల్చే అవకాశం ఉంటుంది. నోటీసులపై న్యాయవాది ద్వారా జవాబు ఇచ్చేందుకు అలీ సిద్ధ్ద మవుతున్నట్లు సమాచారం.