calender_icon.png 5 February, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు!

05-02-2025 02:21:08 AM

పదిమందికి నోటీసులు పంపించిన అసెంబ్లీ కార్యదర్శి

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నరసింహాచార్యులు నోటీసులు పంపించారు. బీఆర్‌ఎస్ నుంచి పలు వురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడంపై వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ సెక్రెటరీ ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు.

నోటీసులకు లిఖితపూర్వకంగా వివర ణ ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసులు అందినవారిలో బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మ హిపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, దానం నా గేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఉన్నారు.

ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కో రినట్టు సమాచారం. నోటీసుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చేందుకు ఎలాంటి గడువు సూచించనట్టు తెలుస్తోంది.

దీనిపై అసెంబ్లీ లాబీల్లో కడియం శ్రీహరి మీడియాతో మా ట్లాడారు. నోటీసుల్లో లిఖితపూర్వక వివరణకు ఎలాంటి గడువు లేనట్టుగా ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ చేసినప్పటికీ.. నోటీసుల్లో గడు వు పేర్కొనకపోవడంతో.. ఫిరాయింపులపై స్తబ్ధత కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.