బడుల్లోని సౌకర్యాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్ ఆర్సీ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) నోటీసులు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మౌలిక వసతులు, విద్యాప్రమాణాలు సరిగాలేవని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వురపల్లి ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుకు స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్ర భుత్వానికి నోటీసులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.