కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): పార్టీ వ్యతిరేక కార్యాక లాపాలకు పాల్పడినందుకు కాంగ్రె స్ నాయకుడు వడ్డెపల్లి సుభాష్‌రెడ్డికి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ బీ చిన్నారెడ్డి ఈ మేరకు ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుభాష్‌రెడ్డికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతూ విభజించూ పాలించు సూత్రాన్ని చేస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలుపాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్ర జల్లో వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తు న్న సుభాష్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ క్యాడర్ మ నోభావాలను దెబ్బతిసే విధంగా సు భాష్‌రెడ్డి వ్యవహరించినందుకు ఫిర్యాదు చేశా రు. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో జవాబు ఇవ్వాలని లేకపోతే చర్యలు ఉంటాయని నోటీసులో పేర్కొన్నారు.