calender_icon.png 13 February, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కీలక నేతకు నోటీసులు

13-02-2025 01:39:13 PM

రంగారెడ్డి, (విజయక్రాంతి): మొయినాబాద్ ఫార్మ్‌హౌస్‌(Moinabad Farmhouse)లో కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు గురువారం నోటీసులు ఇచ్చారు. కోడి పందాలు నిర్వహించిన ఫార్మ్‌హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Pochampally Srinivas Reddy)దిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌ను సబ్ లీజుకు భూపతి రాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ తీసుకున్నారు. ఫార్మ్ హౌస్‌లో భారీ సెటప్‌తో కోడి పందాలను గబ్బర్ నిర్వహించాడు. ఫామ్ హౌస్ నిర్వహణపై మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) విచారణ చేయనున్నారు.

బెట్టింగ్ కాయిన్స్ సీజ్..

కాగా.. మూడు రోజుల క్రితం నగర శివారులో భారీ క్యాసినోను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌పై దాడి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నగదుతోపాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం పరుచుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్(Betting Coins) కూడా సీజ్ చేశారు. పట్టుబడినవారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.