10-03-2025 12:00:00 AM
విమల్ పాన్ మసాలా ప్రకటనపై వివాదం
జైపూర్, మార్చి 9: బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు జైపూర్ వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ పలుకుల్లో కుంకుమపువ్వు మిళితమై ఉందని పేర్కొనడాన్ని జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తప్పుబట్టారు. ఈ క్రమంలోనే విని యోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు హీరలతోపాటు ఆ సంస్థ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసిన వినియోగదారుల ఫోరం.. మార్చి 19న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.