14-03-2025 12:40:23 AM
మొయినాబాద్ పీఎస్‌కు విచారణకు రావాలన్న పోలీసులు
శేరిలింగంపల్లి, మార్చి 13: ఫామ్‌హౌస్ కోడి పందేల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహణ కేసులో ఇప్పటికే గత నెల 13న తొలిసారిగా పోచంపల్లికి ఓసారి నోటీసులు అందాయి. దీంతో అప్పుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తరపు లాయర్ ఆ నోటీసులకు సమాధానం ఇచ్చారు. తాజాగా గురువారం ఉదయం మాదాపూర్‌లోని అపర్ణ ఆర్కెడ్‌లో ఉన్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లిన పోలీసులు ఈ నెల 14న మొయినాబాద్ పీఎస్‌కు హాజరు కావాలని రెండోసారి నోటీసులు అందించారు.