కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కొండలను రాళ్లుగా కొట్టేందుకు రేయింబవళ్లు పేలుడు పదార్థాలను ఎందుకు వినియోగిస్తున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదు లైన రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, పర్యావరణ మంత్రిత్వశాఖ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ లి, గనుల శాఖ డైరెక్టర్, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది.
జూబ్లీహిల్స్‌లోని కొండల్ని కొట్టేందుకు రాత్రింబవళ్లు పేలుడు పదార్థాలను వినియోగిస్తుండటంపై పత్రికల్లో వచ్చి న కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది. న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ పత్రిక ల్లో వచ్చిన కథనాలపై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. పరిశీలించిన న్యాయమూ ర్తుల కమిటీ పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది. కాగా, ఇక్కడ నిత్యం కనీసం పదిసార్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారని, రాళ్లను రాత్రివేళ లారీల ద్వారా రవాణా చేస్తున్నారని.. ఈ చర్యల వల్ల న్యాయవిహార్, భరణి లేఅవుట్, రామానాయుడు స్టూడియో తదితర ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారనే పత్రిక కథనాలపై ప్రతివాదులు కౌంటర్ పిటిష న్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.