calender_icon.png 31 January, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఐఏఎస్‌లకు నోటీసులు

29-01-2025 12:41:48 AM

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): గతేడాది హైకోర్టు ఉత్తర్వు లను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌లో ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కుమ్రంభీం కలెక్టర్ వెంకటేశ్, సీసీఎల్‌ఏ నవీస్ మిట్టల్‌లకు నోటీసులు ఇచ్చింది. మీపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని కోరింది.

విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేస్తూ జస్టిస్ లక్ష్మణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొసిని గ్రామంలో కొనుగోలు చేసిన భూములను మ్యుటేషన్ చేసి, ఈపట్టాదార్ పాసుపుస్తకాలు జారీ చేయాలని గతేడాది ఆగస్టు 14న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై వెంకటనారాయణరావు అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులైన కలెక్టర్, సీసీఎల్‌ఏలకు న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు.