calender_icon.png 19 April, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ ఫొటోను రీపోస్టు చేసిన ఐఏఎస్ స్మితకు నోటీసులు

17-04-2025 01:54:59 AM

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను  స్మితాసబర్వాల్ రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. ఈ మేరకు బీఎన్‌ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు.