calender_icon.png 26 April, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటిలోగా హైదరాబాద్‌లో కనిపించొద్దు.. పాక్ పౌరులకు హెచ్చరిక

26-04-2025 01:31:04 PM

హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు నోటీసులు

హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత ప్రభుత్వం(Government of India) అప్రమత్తమైంది. హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు పాకిస్తాన్ పౌరులకు నోటీసులు ఇచ్చారు. నలుగురు షార్ట్ టర్మ్ వీసాలతో ఉన్న నలుగురికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పాక్ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో నివసిస్తున్న మొత్తం 228 మంది పాకిస్తానీ జాతీయులు(Pakistani nationals) కేంద్రం నిర్ణయించిన ఏప్రిల్ 27 గడువుకు ముందే భారతదేశం విడిచి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి(Pahalgam Terrorist attack)లో 26 మంది మరణించిన విషయం తెలిసిందే.