calender_icon.png 19 April, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి డాక్టర్ మన్నె క్రిశాంక్‌కు నోటీసులు

08-04-2025 12:34:00 AM

9, 10, 11వ తేదీలలో పోలీసుల ముందు హాజరు కావాలాంటు నోటీసు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7:హెచ్ సీయూ భూముల వివాదంపై పోలీసుల చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్ సీయూ ఇష్యూలో జింకలు, నెమళ్లకు సంబంధించి ఏ ఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పేర్కొంటూ బీఆర్ ఎస్ నాయకుడు డాక్టర్ మన్నె క్రిశాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.హెచ్ సీయూ వివాదంపై ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు చేశారని పేర్కొంటూ సోమవారం కృశాంక్‌కు నోటీసులు అందజేశారు.

అందులో ఈ నెల 9, 10, 11వ తేదీలలో పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపారు. పోలీసులు జారీ చేసిన నోటీసుపై స్పందించిన డాక్టర్ మన్నె క్రిశాంక్ బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు తాను ఎక్కడ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ వాడలేదన్నారు. ఇటీవల హెచ్ సీయూ కు సంబంధించి విడుదల చేసిన ఫోటోలు వీడియోలు అన్ని వాస్తవమే నన్నారు. పోలీసుల నోటీసులను మేము లీగల్ గా ఎదుర్కొంటామని తెలిపారు.

జింకలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చాయి, ఇళ్లలోకి కూడా వెళ్ళాయి, అవన్నీటికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని క్రిశాంక్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ జింకలు లేవు, అక్కడ నక్కలు ఉన్నాయని అన్నారు. ఆంక్షలు పెట్టారు, అక్కడికి ఎవరూ రావొద్దని ఆంక్షలు పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏఐతో వీడియోలు సృష్టించారని అబద్దాలు చెప్తుందని విమర్శించారు.

ఏఐ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా అని క్రిశాంక్ ప్రశ్నించారు. హెచ్ సీయూలో జింకలు, నెమళ్లున్నాయని జాతీయ స్థాయిలో వీడియోలు తిరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం నాపై నాలుగు కేసులు పెట్టిందని, జింకలు చనిపోవడానికి కారణం ఎవరు, ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరు.? వాటికి కారణం అయిన వారిపైన కేసులు పెట్టాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. హెచ్ సీయూ అంశంపై అందరూ వీడియోలు పెడుతున్నారని వాపోయారు.