calender_icon.png 17 January, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమేశ్‌కుమార్‌కు త్వరలో నోటీసులు!

08-08-2024 01:18:55 AM

  1. జీఎస్టీ స్కామ్ కేసులో కీలక పరిణామం
  2. ఆ తర్వాత అరెస్టులు జరిగే అవకాశం?

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జీఎస్టీ స్కామ్ కేసులో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో సోమేశ్‌కుమార్ ఏ5గా ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో దాదాపు రూ.1000 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు శ్రీదేవి కమిషనర్‌గా ఉన్న సమయంలో చేసిన విచారణలో తేలింది. సోమేశ్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు అభియోగాలు మోపారు.

ఈ తతంగం అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జేసీ రవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా డిప్యూటీ కమిషనర్ శివరామ్‌ప్రసాద్, ఏ3గా ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ఏ4గా ప్రియంటో టెక్నాలజీస్ కంపెనీ, ఏ5గా సోమేశ్ ఉన్నారు. ఈ క్రమంలో వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఆ తర్వాత అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.