calender_icon.png 5 February, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ వెంచర్‌కు నోటీసులు

05-02-2025 12:00:00 AM

  1. జారీ చేసిన ఎంపీడీవో మున్ని 
  2. పనులు నిలిపివేయాలని సూచన.. లేదంటే కూల్చేస్తామని హెచ్చరిక 
  3. విజయ క్రాంతి కథనానికి స్పందన

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 4:విజయ క్రాంతి’ కథనానికి అధికారులు స్పందించారు. ’111 నిబంధనలకు నీళ్లు’ అనే  శీర్షికతో శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో సర్వేనెంబర్ 77, 78, 79 లో 111 జీవో పరిధిలో అక్రమంగా లేఔట్ చేస్తున్నారని సోమవారం విజయ క్రాంతి పత్రికలో సమగ్ర వివరాలతో కథనం ప్రచురితమైంది.

కొందరు వ్యక్తులు జి బి ఐ టికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని సుమారు పది ఎకరాలకు పైగానే భారీ వెంచర్ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా అక్రమ లేఔట్ కు సంబంధించి ’విజయ క్రాంతి’ పత్రిక పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీడీవో మున్ని మంగళవారం స్పందించారు.

వెంచర్ చేస్తున్న నిర్వాహకుడు సత్య కిషోర్ కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వెంటనే మల్కారం గ్రామపంచాయతీకి వివరణ ఇవ్వాలని, లేదంటే వెంచర్ను పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు. అందులో ఏర్పాటు చేసిన నిర్మాణాలను కూడా తొలగిస్తామని ఈ సందర్భంగా నోటీసుల్లో ఎంపీడీవో మున్ని హెచ్చరించారు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.