calender_icon.png 24 November, 2024 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు అలీకి నోటీసులు

24-11-2024 01:31:50 PM

హైదరాబాద్: అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ లో నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నటుడు అలీకి వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎక్కమిడి గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు పొందకుండానే అక్రమ నిర్మాణాలు చేపట్టి నిర్మాణాలు చేపట్టారని గ్రామ కార్యదర్శి శోభారాణి తెలిపారు. అయితే గ్రామ పంచాయతీ నుంచి ముందస్తు అనుమతులు పొందకుండానే ఫామ్‌హౌస్‌, సంబంధిత నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్ మామిడి పరిధి సర్వే నంబర్ 345లోని ఫామ్ హౌస్ లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను ఇచ్చి అనుమతులు తీసుకోవాలంటూ గతంలోనే అలీకి నోటీసులు అందాయి. నోటీసులపై ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి మరోసారి నోటీసులిచ్చారు. ఫాంహౌస్ కు చెందిన పత్రాలు సమర్పించి అనుమతులు తీసుకోవాలని, లేకుండా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని శోభారాణి పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లోని కేర్‌టేకర్‌కు అందజేసిన నోటీసుల్లో అనధికార నిర్మాణాలకు సంబంధించి అలీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులపై అలీ ఇంకా స్పందించలేదు. ఈ సంఘటన హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లను కలిగి ఉన్న కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను కలవర పెడుతోంది.