23-03-2025 12:41:39 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం సభను తప్పుదోవపట్టించే విధంగా ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.