12-02-2025 12:54:43 AM
ఇటీవల జిమ్‌లో గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దాని నుంచి కోలుకుని తన తదుపరి సినిమా పనుల్లో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాల గురించి కూడా ఆమె చర్చించింది. “గాయపడిన తర్వాత నా శరీరంపై గౌరవం పెరిగింది. కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నా.
ఏదీ అతిగా చేయకూడదని అర్థమైన తర్వాత నేనిచ్చే సలహా ఒక్కటే. ‘మీ శరీరం మాట వినండి. పరిమితికి మించి వ్యాయామం చేయకండి. గాయం నుంచి కోలుకుని సెట్స్‌లోకి రావడం ఆనందంతో పాటు ఉత్సాహం, ఉద్వేగాన్నిస్తోంది. ఇకపై ఒత్తిడికి గురి కాకుండా పని చేస్తా. ప్రస్తుతం నేను నటిస్తున్న “మేరే హస్బెండ్‌కీ బీవీ’ ఒక భిన్నమైన కథ.
ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలు వచ్చింది లేదు. దీనికి నిర్మాత నా భర్తే. అందుకే ఈ సినిమా నాకు మరింత ప్రత్యేకం. సెట్స్‌లో మేము ప్రొఫెషనల్‌గా ఉంటాం” అని రకుల్ తెలిపింది. మేరే ‘హస్బెండ్ కీ బీవీ’ సినిమాలో అర్జున్ కపూర్, రకుల్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.